
Price: ₹250.00
(as of Dec 08, 2025 05:47:10 UTC – Details)
80లలో ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం తప్పనిసరి కానప్పటికీ, దానిపై పట్టు సాధించిన వాళ్లు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అవకాశాలు పొందారు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా సంభాషించడానికి, తమ కెరీర్లలో సులభంగా ముందుకు వెళ్లదానికి వీలు కలిగింది. 90లలో కంప్యూటర్ వచ్చినప్పుడు, దాన్ని అందుకున్న వాళ్లు తమ జీవితాలను సులభతరం చేసుకున్నారు. టెక్నాలజీ అంటే భయం వలనో అనుమానం వలనో సంశయించిన వాళ్లు వెనుకబడిపోయారు. ఈ రోజు, ప్రతి రంగంలో, ప్రతి కుటుంబంలో జనరేటివ్ AI వాడటం అనేది కొత్తగా అవసరమౌతున్న నైపుణ్యం. ఇది టెక్నాలజీ సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్నవాళ్లకే కాదు. ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ ఉద్యోగమూ చెయ్యకపోయినా, నిత్య జీవితంలో చిన్న చిన్న పనుల నుంచి కళలలో ప్రావీణ్యం వరకు అన్ని చోట్ల అవసరమయ్యే కొత్త భాషగా మారుతోంది. అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటున్న ఈ నైపుణ్యంపైన చాలా సరళమైన సంభాషణతో పట్టు సాధించవచ్చు అని ఈ పుస్తకం నిరూపిస్తుంది. ఈ పుస్తకం, 30 రోజులలో మీ AI సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచే విధంగా రూపొందించబడింది. వ్యాసాలు, రిపోర్ట్ లు, స్టడీ గైడ్ లు, అద్భుతమైన చిత్రాలు, ఒరిజినల్ సంగీతం, వీడియోలు లాంటివి ఏవైనా రూపొందించడానికి AI సహాయం ఎలా తీసుకోవాలో సాంకేతిక పరిభాషను వాడకుండా ఈ పుస్తకం మీకు నేర్పిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రయాణంలో మీరు నేర్చుకునే ఆరు AI రహస్యాలు మిమ్మల్ని మిగిలిన ప్రపంచంతో పాటు ముందుకు సాగడానికి సన్నద్ధం చేస్తాయి. అందుకు అవసరమైన నైపుణ్యం, సృజనాత్మకతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా మీకు బోధిస్తాయి.
Publisher : Anvikshiki Publishers (30 November 2025)
Paperback : 220 pages
ISBN-10 : 9348912135
ISBN-13 : 978-9348912138
Item Weight : 300 g
Dimensions : 24 x 14 x 2 cm
Country of Origin : India
Packer : Anvikshiki Publishers, Hyderabad
Generic Name : Book
Best Sellers Rank: #30,279 in Books (See Top 100 in Books) #89 in Artificial Intelligence

Posted inTechnology & Computer Science
